ప్రజ్ఞా సింగ్ కూడా ఓ ఉగ్రవాదని ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా ప్రజ్ఞా సింగ్‌ను విమర్శించారు. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ద్వారా అరెస్సెస్, బీజేపీ నేతల మనసులోని మాటే బయటకు వచ్చిందన్నారు. 'ఉగ్రవాది ప్రజ్ఞా సింగ్.. ఉగ్రవాది అయినా గాడ్సేను దేశభక్తుడని అన్నారు. పార్లమెంట్ చరిత్రలో ఇదో దుర్దినం' అని ట్వీట్ చేశారు.
ముఖ్యంగా, దేశ పార్లమెంట్‌లో ప్రజ్ఞా సింగ్ మాట్లాడుతూ, జాతిపిత మహాత్మగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే దేశ భక్తుడని బుధవారం లోక్‌సభలో ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యానించారు. దీంతో సభలో విపక్ష సభ్యులు బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆ వెంటనే అప్రమత్తమైన కమలనాథులు... ప్రజ్ఞాసింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. అంతేకాకుండా,