దేశభక్తిని బలవంతంగా మోయాల్సిన అవసరం లేదు : సుప్రీంకోర్టు

మంగళవారం, 24 అక్టోబరు 2017 (09:21 IST)
సినిమా థియేటర్లలో జాతీయ గీతాలాపన సమయంలో తప్పనిసరిగా లేచి నిల్చోవాలంటూ గతంలో జారీచేసిన ఉత్తర్వులను సవరించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇకపై థియేటర్లలో లేచి నిలబడి తమలోని దేశభక్తిని బలవంతంగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదంటూ కీలక తీర్పు చెప్పింది. 
 
జాతీయ గీతాలాపన సమయంలో లేచి నిలబడాలనడం దేశ భక్తికి సూచన కాదని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై.చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ మేరకు ఫ్లాగ్ కోడ్ నిబంధనలను సవరించాలని కేంద్రానికి సూచించింది.
 
గతేడాది డిసెంబరు 1న జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనమే ఈ ఉత్తర్వులు ఇచ్చింది. థియేటర్లలో జాతీయ గీతాలాపన సమయంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా లేచి నిల్చోవాలని అందులో పేర్కొంది. దేశభక్తిని, జాతీయ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే దీని ఉద్దేశమని అప్పట్లో పేర్కొంది. ఇపుడు ఈ తీర్పును సవరించేందుకు సిద్ధమైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు