కోతికి మళ్లీ ప్రాణం పోసిన ప్రభు - నెటిజన్ల సంతోషం

సోమవారం, 13 డిశెంబరు 2021 (22:25 IST)
ఈ రోజుల్లో కూడా మానవత్వం ఇంకా సజీవంగా బతికే ఉందని తమినాడు రాష్ట్రంలోని పెరంబూరు జిల్లా వాసి ఒకరు చేతల్లో నిరూపించాడు. చావు బతుకుల మధ్య ఓ కోతికి మళ్లీ ప్రాణం పోశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతి ఒక్కరూ ఆయన్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పెరంబలూరు పట్టణానికి చెందిన ప్రభు అనే వ్యక్తి వృత్తిరీత్యా కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే, ఈ నెల 9వ తేదీన తన స్నేహితుడితో కలిసి బైక్‌పై ఊరికి బయలుదేరాడు. ఆ సమయంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టు పక్కన స్పృహ కోల్పోయి పడిపోయువున్న కోతిని గమనించాడు. మరోవైపు, ఆ కోతిని కుక్కలు కరవసాగాయి. ఆ వెంటనే బండిని ఆపి ఆ కుక్కలను అక్కడి నుంచి తరిమేసి ఆ కోతిని తట్టిలేపాడు. కానీ ఆ కోతి లేవలేదు. 
 
దీంతో ఆ కోతికి కొన్ని మంచినీళ్లు తాపించినా ఆ కోతి లేవక పోవడంతో కోతిని తీసుకుని తన మిత్రుడి బైక్ మీద వెటర్నరీ ఆస్పత్రికి బయలుదేరాడు. అయితే, మార్గమధ్యంలో ఆ కోతి శ్వాసపీల్చడం కష్టంగా మారింది. ఈ విషయాన్ని గమనించిన అతను ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తన నోటి ద్వారా కృత్రిమ శ్వాసను అందిస్తూ ఛాతిమీద కొట్టడంతో ఆ కోతి శ్వాస పీల్చడం ప్రారంభించి కళ్లు తెరిచి చూసింది. అంతే.. ఆ వ్యక్తి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. 

 

There are people who still value every little life on this earth. Here Mr.Prabhu uses the first aid techniques he learned years back to resuscitate a 8 month old macaque which was attacked by a group of dogs
His swift action has saved the life of this little fella. @Thiruselvamts pic.twitter.com/bTHhIy5Km9

— Sudha Ramen

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు