కపాలీశ్వర స్వామి కొలనులో కార్తీక దీపాలు: చచ్చి తేలియాడుతున్న చేపలు

సోమవారం, 27 నవంబరు 2023 (18:39 IST)
fishes
తమిళనాడు రాజధాని చెన్నై, మైలాపూర్‌లో కపాలీశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇదే మైలాపూరులో కేశవ పెరుమాళ్ల వారి ఆలయం వుంది. ఈ ఆలయంలోని కొలనుకు చిత్తిరై కొలను అనే పేరుంది. ఈ కొలనులోని తీర్థం పాపాలను హరిస్తుందని విశ్వాసం. 
 
తాజాగా కపాలీశ్వర ఆలయంలోని కొలనుతో పాటు చిత్తిరై కొలనులో చేపలన్నీ చనిపోయి నీటిపై తేలియాడుతున్నాయి. కొలను లోని చేపలన్నీ ఇలా చనిపోయి.. చేపలతొట్టెలా కనిపించడం భక్తుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. కొలను మొత్తం చనిపోయిన చేపలు తేలియాడటం చూసి భక్తులు షాకవుతున్నారు.
 
కార్తీక మాసం కావడంతో పుణ్య స్నానాల కోసం కొలనుకు వచ్చే భక్తులు చనిపోయిన చేపలతో కూడిన కొలను చూసి బాధపడిపోతున్నారు. కాగా కొలనులో ఇలా భారీ ఎత్తున చేపలు ఎలా చనిపోయి వుంటాయనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. కాగా భక్తులు వెలిగించిన కార్తీక దీపాల నూనె కొలను నీటిలో కలిసి చేపలు చనిపోయి వుంటాయన్న వాదన వినిపిస్తోంది.

கோயில் குளத்தில் செத்து மிதக்கும் மீன்கள்#Chennai | #Temple | #Fish pic.twitter.com/yz0grDCpIL

— PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) November 27, 2023

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు