అమ్మవారికి చుడీదార్ అలంకరణ.. పూజారులపై వేటు.. ఎక్కడ?

సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (16:16 IST)
తమిళనాడులోని నాగై జిల్లాలో అమ్మవారికి పట్టువస్త్రాలంకరణను పక్కనబెట్టి  శాస్త్రాలకు విరుద్ధంగా చుడీదార్ వస్త్రంతో అలంకరించిన పూజారులు సస్పెన్షన్‌కు గురయ్యారు. కాశీకి సమానమైన ఆలయంగా పేరున్న శివాలయాల్లో మయిలాడుదురైలోని శివాలయం ఒకటి. ఇక్కడ అమ్మవారు నెమలి రూపంలో పరమేశ్వరుడిని పూజించినట్లు పురాణాలు చెప్తున్నాయి.
 
ఈ నేపథ్యంలో మయిలాడుదురైలోని మయూరనాధ ఆలయంలో అభయాంబికగా వెలసిన అమ్మవారికి చుడీదార్ అలంకరణ చేశారు... పూజారులు. ఈ ఆలయంలోని అమ్మవారు చుడీదార్ అలంకరణలో భక్తులు దర్శనమివ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక అమ్మవారికి చుడీదార్ అలంకరణ చేసిన పూజారులు రాజ్, కల్యాణం అనే ఇద్దరిని ఆలయ నిర్వాహకులు సస్పెండ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు