వరుడు తండ్రి తెచ్చిన లెహంగా నచ్చని వధువు.. పెళ్లి రద్దు చేసిన వరుడు

గురువారం, 10 నవంబరు 2022 (07:54 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన జరిగింది. వరుడు తండ్రి తెప్పించిన లెహంగా వధువు నచ్చలేదు. దీంతో మరికొన్ని రోజుల్లో జరగాల్సిన పెళ్లిని వరుడు కుటుంబీకులు రద్దు చేసుకున్నారు. ఇందుకోసం వారు లక్ష రూపాయలు వధువు కుటుంబీకులకు చెల్లించి ఈ పెళ్లిని రద్దు చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రాష్ట్రంలోని హల్ద్వానీకి చెందిన యువతికి అల్మోరాకు చెందిన యువకుడికి వివాహం నిశ్చమైంది. ఈ నెల 5వ తేదీన వివాహం జరగాల్సి ఉండగా వరుడు తరపు వారు శుభలేఖలు కూడా ముద్రించి బంధు మిత్రులకు పంపిణీ చేశారు. 
 
ఈ క్రమంలో వధువు కోసం వరుడి తండ్రి లక్నో నుంచి ఖరీదైన లెహంగా తెప్పించి, దానిని తన ఇంటికి కాబోయే వధువుకు ఇచ్చాడు. అయితే, దాన్ని చూసిన వధువు పెదవి విరిచింది. నచ్చలేని తన కుటుంబ సభ్యులకు చెప్పింది. 
 
ఈ విషయం వరుడి ద్వారా అతని తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఇరు వర్గాల వారు గొడవపడ్డారు. ఇక లాభం లేదని పెళ్లి జరిగేది లేదంటూ యువకుడి కుటుంబ సభ్యులు ఈ పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఈ ఘటన అక్టోబరు 30వ తేదీన జరిగింది. ఈ వివాహం ఈ నెల 5వ తేదీన జరగాల్సివుండగా వధువు చేసిన పనికి ఈ వివాహం రద్దు అయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు