వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మల్కాజ్‌గిరి సాయినాథ్‌పురానికి చెందిన విద్యార్థిని ఈసీఐఎల్‌లోని మహిళా డిగ్రీ కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న కుషాయిగూడకు చెందిన బి. సాగర్ రెండు నెలలుగా ఆ విద్యార్థినిని లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు.