వయనాడ్‌లో ప్రియాంకా గాంధీ.. రోడ్ షో, నామినేషన్ దాఖలు

సెల్వి

బుధవారం, 23 అక్టోబరు 2024 (10:12 IST)
Wayanad
వయనాడ్‌లో జరగనున్న లోక్‌సభ ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ప్రియాంక మంగళవారం రాత్రి తన తల్లి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీతో కలిసి వయనాడుకు వచ్చారు. 
 
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇప్పటికే వయనాడుకు చేరుకున్నారు.  వీరితో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏఐసీసీ సీనియర్ నేతలు కూడా ప్రియాంకకు మద్దతుగా హాజరుకానున్నారు. 
 
నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ప్రియాంక, ఆమె సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి కల్పేటలో ఉదయం 11 గంటలకు రోడ్‌షో నిర్వహించనున్నారు. ఉదయం 11.45 గంటలకు, రోడ్‌షో తర్వాత, ఆమె బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత, ఆమె తన నామినేషన్ దాఖలు చేస్తారు.  
 
వయనాడ్ లోక్‌సభ ఎన్నికల్లోనూ, రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రాహుల్ గాంధీ వయనాడ్‌ నుంచి తప్పుకున్నారు. దీంతో వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అవసరం అయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు