ఉత్తరభారతంలో మరణ మృదంగం కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే 145 మంది చనిపోయారు. అలాగే, శుక్రవారం హర్యానా, హర్యానా రాష్ట్రాల్లో కుంభవృష్టికురవనుంది. అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో చిక్కుకుని పోయాయి. మరోవైపు, యమున నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో ఈ నెల 16వ తేదీ వరకు ఢిల్లీలో అన్ని స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. మృతుల్లో ఒక్క హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 91 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 14 మంది, హర్యానాలో 16 మంది, పంజాబ్‌లో 11, ఉత్తరఖండ్‌లో 16 మంది చనిపోయారు.
ఇదిలావుంటే, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఢిల్లీలో మరింత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అనేక లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటిలో చిక్కుకుని పోయాయి. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉంది. దీంతో ఈ నెల 16వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే, ఎర్రకోట సందర్శనను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.