భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఉదారత వల్లే ఆమెకు ఈ వీసా దక్కింది. ఎమాన్ అహ్మద్(36) ఈజిప్టులోని అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందిన మహిళకు భారత్‌లో చికిత్స చేయనుంది. సదరు మహిళ 500 కేజీల బరువుతుంది. స్థూలకాయం కారణంగా పాఠశాలకు వెళ్లే సమయంలోనే బరువు పెరగడం ప్రారంభమైంది. దీంతో చదువు మధ్యలోనే ఆపేసింది.
అయితే, ఆమెకు ముంబయిలోని వైద్యులు చికిత్స చేసేందుకు ముందుకొచ్చారు. ఆమెకు వీసా ఇచ్చి ముంబయిలో చికిత్స పొందేందుకు అవకాశం ఇవ్వాలని బేరియాట్రిక్ సర్జన్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు విజ్ఞప్తి చేశారు. ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నప్పటికీ సుష్మా చేయూత నివ్వడంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం సుష్మా స్వరాజ్ మూత్రపిండాల సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.