సుప్రీకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణకు నాట్స్ అభినందనలు

శనివారం, 24 ఏప్రియల్ 2021 (23:18 IST)
న్యూ జెర్సీ: భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ నూతలపాటి వెంకట రమణకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తుంది. ఎన్.వి. రమణ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడం యావత్ తెలుగుజాతి గర్వించాల్సిన విషయమని నాట్స్ పేర్కొంది.
 
నాట్స్‌తో కూడా ఎన్.వి రమణకు అనుబంధం ఉన్నందుకు తామెంతో గర్వంగా భావిస్తున్నామని నాట్స్ జాతీయ నాయకత్వం తెలిపింది. తెలుగు భాష పట్ల ఎన్.వి. రమణ చూపే మమకారం కూడా ఎన్నటికి మరిచిపోలేమని తెలిపారు.
 
ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన రమణ అంచెలంచెలుగా ఎదిగి సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడమనేది అందరిలో స్ఫూర్తిని నింపే అంశమని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నే ఓ ప్రకటనలో తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు