శుక్రవారాన్ని లక్ష్మీ వారం అంటారు. అలాంటి లక్ష్మీవారంలో ఇలా చేస్తే తీవ్రమైన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. శుక్రవారం రోజున ఈ పరిహారం చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు జీవితంలో ఆనందం, శ్రేయస్సు చేకూరుతుంది.
శుక్రవారం సంపద దేవత అయిన లక్ష్మీ దేవతకు అంకితం చేయబడింది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం ప్రత్యేకమైన రోజు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. మీరు కనుక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లయితే, శుక్రవారం రోజున ఉపవాసం ఉండి, శ్రద్ధతో లక్ష్మీదేవిని పూజించాలి.
శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మికి పాయసాన్ని, రవ్వతో చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ ప్రసాదాన్ని ఏడుగురు చిన్న పిల్లలకు అందించాలి. శుక్రవారం నాడు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. 21 శుక్రవారాలు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట కొలువై వుంటుంది.
శుక్రవారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా కుంకుమ, పసుపుతో స్వస్తిక్ రాయాలి. ఇది లక్ష్మీ దేవిని ఇంటికి తీసుకువస్తుంది. ఇంకా సానుకూల శక్తిని ఇస్తుంది. ఈ పరిహారం చేయడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.
ఇంట్లోని స్త్రీలను, పెద్దలను ఎప్పుడూ గౌరవించండి. ఇది జరిగిన ఇంట్లో తల్లి లక్ష్మి నివాసం ఉంటుంది. అలాంటి ఇళ్ళు ఆనందం, శ్రేయస్సు, ఐశ్వర్యంతో నిండి ఉంటాయి. ఇంకా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం వుండదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.