నివాసంతో పాటు పరిసరాల్లో ప్రతికూల శక్తులు వుండకూడదని అందరూ భావిస్తుంటారు. గృహంతో పాటు కార్యాలయాల్లో ప్రతికూల ప్రభావాలుంటే.. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అంతేగాకుండా ప్రతికూల ప్రభావంతో ఇంట్లో దారిద్ర్యం తప్పదు. అందుకే ప్రతికూల ప్రభావంతో పాటు దారిద్ర్యాన్ని పోగొట్టుకోవాలంటే.. ఉప్పును ఉపయోగించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
అలాగే ఒక గ్లాసుడు నీటిలో ఉప్పు చేర్చి ఇంటికి నైరుతి దిశలో వుంచాలి. ఇలా వుంచితే ఇంట్లో దారిద్ర్యం తొలగిపోతుంది. ఆర్థికాభివృద్ధి చేకూరుతుంది. ఈ నీటిని ప్రతిరోజూ లేదా రోజు మార్చి రోజు మారుస్తూ వుండాలి. అలాగే ఓ బౌల్‌లో గుప్పెడు రాళ్ల ఉప్పును తీసుకుని.. ఆ బౌల్‌ను స్నానపు గదిలోని ఓ మూలలో వుంచాలి. ఈ ఉప్పును వారానికి ఓసారి లేదా రెండు రోజులకు ఓసారి మార్చడం మరిచిపోకూడదు.