సాధారణంగా అందరి ఇంట్లోను బల్లి కనిపిస్తుంటుంది. అది ఇంట్లోకి వచ్చే కీటకాలను ఆహారంగా స్వీకరిస్తుంది. అందువలన ఎవరు కూడా వాటిని ఇంట్లో నుంచి తరిమివేసే ఆలోచన చేయరు. అవి హాని చేసేవి కూడా కాకపోవడం వలన ఎవరూ వాటిని అంతంగా పట్టించుకోరు. అయితే బల్లి కుడా శకునం పలుకుతుందని, బల్లిపాటుకి ఫలితం ఉంటుందని పరిశోధనలో చెప్పబడుతోంది.
సాధారణంగా బల్లులు పైకప్పును, గోడలను, తలుపులను, కిటికీ రెక్కలను అంటిపెట్టుకుని కనిపిస్తుంటాయి. ఏదో ఒక సందర్భంలో అవి మీద పడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో శరీరంపై గల వివిధ ప్రదేశాల్లో ఒక్కోచోట బల్లిపడడం వలన ఒక్కోఫలితం చెప్పబడుతోంది. కొన్ని ప్రదేశాల్లో బల్లిపాటు మంచి ఫలితాలనిస్తాయి.