మార్గశిర మాసం సోమవారం- స్కంధ షష్ఠి.. పూజ ఇలా చేస్తే?

సోమవారం, 18 డిశెంబరు 2023 (10:32 IST)
మార్గశిర మాసంలో వచ్చే సోమవారం రోజున వ్రతం ఆచరించే వారికి శుభాలు చేకూరుతాయి. కోరిన కోర్కెలను అడగగానే తీర్చే భోలాశంకరుడు, మనఃకారకుడు అయిన చంద్రుడిని ప్రసాన్నం చేసుకోవడానికి ఈ సోమవార వ్రతం ఎంతో శ్రేష్టమైనది. 
 
"ఓం నమశ్శివాయ" అని స్మరించుకుంటూ అభ్యంగన స్నానం చేయాలి. సాయంత్రం పూట ప్రదోష కాలంలో అర్థనారీశ్వర స్తోత్రం పఠిస్తూ తెల్లని పువ్వులు, శ్వేతగంధం, బియ్యంతో చేసిన పిండివంటలు, పంచామృతాలు, శ్వేతాక్షతలు, గంగాజలం, బిల్వపత్రాలతో పూజించాలి.
 
అలాగే సోమవారంతో పాటు స్కంధ షష్ఠి తిథి రావడంతో ఈ రోజున కుమార స్వామి పూజ చేయడం విశిష్ట ఫలితాలను ఇస్తుంది. స్కంద షష్టి నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం నిర్వహిస్తారు. అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి. 
 
విశిష్టమైన ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా, కావడి సమర్ఫించినా సత్సంతాన ప్రాప్తి చేకూరుతుంది. ఈ రోజు పుట్టలో పాలు పోస్తే సర్పదోషాలు తొలగిపోతాయని విశ్వాసం. స్కంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం జరిపించే భక్తులకు సకలశుభాలు కలుగుతాయని ప్రతీతి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు