నాగుల చవితి రోజున ఎరుపు పువ్వులు.. నువ్వుల నూనెతో..?

గురువారం, 16 నవంబరు 2023 (21:04 IST)
నాగుల చవితి రోజున నాగదేవతను పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. నాగుల చవితి నాడు స్త్రీలు ఉపవాసం ఉండి అత్యంత భక్తిశ్రద్ధలతో నాగదేవతను పూజిస్తారు. పుట్టల దగ్గర శుభ్రం చేసి, నీళ్లు చల్లి, ముగ్గులు వేసి, పసుపు, కుంకుమలు చల్లి, పూలతో అలంకరించి, పుట్టలో పాలు పోసి నాగదేవతకు నమస్కరించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయి. 
 
నాగుల చవితి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించి ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని, పూజా మందిరంలో కలశాన్ని ఏర్పాటు చేసి, దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకొని, నాగేంద్ర స్వామి ప్రతిమను కానీ ఫోటోలు కానీ, పడగను కానీ పెట్టి పూజ చేసుకోవాలి. 
 
పూజకు ఎరుపు రంగు పుష్పాలను వాడటం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. దీపారాధనకు, నెయ్యి, నువ్వుల నూనెను వాడటం మంచిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు