Varahi puja: శనివారం పంచమి తిథి.. వారాహి దేవిని పూజిస్తే కలిగే ఫలితాలేంటి?

సెల్వి

శుక్రవారం, 3 జనవరి 2025 (23:03 IST)
ధ్యాన శ్లోకం ప్రకారం, వారాహి దేవి వరాహమూర్తిని కలిగి ఉంటుంది. వారాహి దేవి భక్తులకు అత్యున్నత రక్షకురాలిగా పరిగణించబడుతుంది. భక్తులకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. ఆమెను పంచమి తిథి రోజున పూజిస్తే కనుక సర్వాభీష్ఠాలు చేకూరుతాయి. గేదె ఆమె వాహనం. 
 
వారాహి దేవిని పూజించడం వల్ల భక్తులకు శత్రుబాధ వుండదు. ప్రతికూలత, అనారోగ్యం, చెడు శక్తులు, ప్రమాదాలు, చెడు కర్మల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఈ వారాహి పూజ ప్రతికూల శక్తులను నివారించడానికి ఉపయోగపడుతుంది. 
 
వారాహి దేవి పూజను పూర్తి భక్తితో చేస్తే, సంతోషం, శత్రువులపై విజయం, శ్రేయస్సు లభిస్తుంది. స్వర్గలోక ప్రాప్తి కోరుకునే వారు వారాహి దేవిని పూజించవచ్చు. వారాహి దేవి ఆరాధన మనస్సును శుద్ధి చేస్తుంది. సంకల్ప శక్తిని పెంచుతుంది. వారాహి దేవి పూజ ఇంట్లో లేదా ఆలయంలో చేయవచ్చు.
 
వారాహి దేవి దేవి మాతృకలలోని ఒకరు. దేవి మహాత్మ్యం ప్రకారం, లలితాంబిక దేవి ఒక్కో అసురుడిని సంహరించడానికి ఒక్కో అవతారాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ క్రమంలో "విశుక్రన్" అనే అసురుడితో పోరాడటానికి ఆమె వారాహి దేవిని సృష్టించింది. 
 
వారాహికి పంచమి పూజ ఒక వ్యక్తి వారి జీవితంలో ఎదుర్కొనే అన్ని సమస్యలను, అడ్డంకులను తొలగిస్తుంది. వారాహి పూజా విధానం ప్రతికూల శక్తి, క్షమించబడని నేరాలు, చేతబడి నుండి మనలను కాపాడుతుంది. అనారోగ్యాలను దూరం చేస్తుంది. పాపాల నుంచి విముక్తి నిస్తుంది. ఉపాధి అవకాశాలను పెంచుతుంది. అలాగే శనివారం పంచమి వస్తే.. ఆ రోజున వారాహి పూజ చేయడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. 
 
వారాహి దేవి పూజను నిర్వహించడానికి శుభ ముహూర్తం, శుభ సమయం..పంచమి తిథి- ఈ రోజున పూజ చేయడం వల్ల విజయం లభిస్తుంది. అష్టమి తిథి- ఈ రోజున వారాహి దేవిని ఆరాధించడం వల్ల ప్రతిభ, విజయం, సంపదలు చేకూరుతాయి.
 
వారాహి దేవిని పూజించడానికి వారాహి యంత్ర పూజను నిర్వహించే ఇతర రోజులు:
దశమి
ద్వాదశి
అమావాస్య
పౌర్ణమి
షష్ఠి

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు