తిరుచానూరులో వార్షిక పవిత్రోత్సవాలు... మూడు రోజుల పండగ

సెల్వి

బుధవారం, 4 సెప్టెంబరు 2024 (11:20 IST)
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక పవిత్రోత్సవాలు సెప్టెంబర్ 16-18 తేదీల మధ్య సెప్టెంబరు 15న అంకురార్పణంతో నిర్వహించబడతాయి. మొదటి రోజు పవిత్ర ప్రతిష్ట, రెండవ రోజు పవిత్ర సమర్పణ, చివరి రోజు పవిత్ర పూర్ణాహుతి నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సెప్టెంబర్ 10న నిర్వహించనున్నారు.
 
ఈ నేప‌థ్యంలో ఈ మూడు రోజులు కల్యాణోత్సవం, బ్రేక్‌ దర్శనం, వేద ఆశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల్‌సేవలు ర‌ద్దు చేసినట్లు టీటీడీ ప్రక‌టించింది. ఈ ఉత్సవాలకు సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్రహణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరగనుంది.
 
ఈ సందర్భంగా సెప్టెంబరు 16న పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 18న పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి. రూ.750 చెల్లించి ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. భక్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు