పాలుతో పాటు ఈ పదార్థాలు తినరాదు, ఎందుకు?

సిహెచ్

సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (21:40 IST)
పాలు బలవర్థకమైనవి అని తెలుసు. అందుకే పాలు తాగేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇలా పాలు తాగేవారు కొన్ని పదార్థాలను పాలు తాగేటపుడు తీసుకోరాదు. అవేమిటో తెలుసుకుందాము.
 
పాలు తాగి వెంటనే పెరుగును తినరాదు, అలా తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
పాలు తాగుతూ పుల్లటి రుచి వుండే పండ్లను తినరాదు, ఇది ఆరోగ్యానికి సమస్య తెస్తుంది.
అరటి పండు- పాలు రెండూ కలిపి తీసుకోరాదు. ఎందుకంటే ఇవి రెండూ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.
పాలు తాగిన వెంటనే చేపలు తినకూడదు. కనుక వాటికి దూరంగా వుండాలి.
కర్బూజ-పాలు రెండూ కలిపి సేవించకూడదు. అలా చేసినవారికి గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తే ఆస్కారం వుంటుంది.
అధిక మసాలాతో చేసిన పదార్థాలను-పాలను రెండూ కలిపి ఒకేసారి తీసుకోరాదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు