మంచంపై కూర్చుని హడావుడిగా భోజనం చేయడం.. పాదరక్షలతోనే భోజనం చేయడం కూడదని పండితులు చెప్తున్నారు. మంచంపై గంటల పాటు కూర్చోవడం.. అక్కడే భోజనం చేయడం వంటివి చేస్తే అరిష్టమని.. మంచాన్ని శయనించేందుకు మాత్రమే ఉపయోగించాలని సూచిస్తున్నారు. మంచంపై నిద్రించవచ్చు కానీ దానిపై కూర్చుని తినకూడదు. నిద్రించేందుకు అవసరం లేనప్పుడు మంచాన్ని ఉపయోగించకూడదు. దానిపై కూర్చోవడం చేయకూడదు. అలాగే భోజనం చేస్తున్నప్పుడు పాదరక్షలు వేసుకోకూడదు. కాళ్లు చేతులు, శుభ్రం చేసుకుని భోజనం చేయాలి.