శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. రాఖీ పండుగనే రక్షా బంధన్ అంటారు. రాఖీ పండుగ రోజు తోబుట్టువులు అన్నా, తమ్ముళ్ళకి రక్షాబంధన్ కడతారు. ఈ రాఖీ పండుగా సోదరులన్న భావన ఉన్న ప్రతి ఒక్కరికీ కడతారు. అంతేకాదు.. ఆడపడుచులు కొంతమంది వారి ఇంట్లోని ఆడవారికి కూడా కడతారు.
ఆ సమయంలో రాక్షసులు గెలవడం ప్రారంభించినప్పుడు దేవరాజు ఇంద్రుని భార్య శుచి, ఇంద్రుని మణికట్టుపై రక్షిత దారం కట్టమని గురు బృహస్పతిని కోరుతుంది. అప్పుడు ఇంద్రుడు ఈ రక్షా సూత్రంతో తనను, తన సైన్యాన్ని రక్షించుకున్నాడు.