శని ఎలా వుంటాడు? ఎవరి పుత్రుడు?

శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (22:32 IST)
నీలాంజనసమాభాసం, రవిపుత్రం యమాగ్రజమ్
ఛాయామార్తాండసంభూతం, తం నమామి శనైశ్చరమ్
 
నవగ్రహాల్లో శని ఏడవవాడు. నల్లని రంగులో సన్నగా వుంటాడు. శనివారం ఆయనకు ప్రశస్తి. నల్లరంగు దుస్తులనే ధరిస్తాడు. కాలు కొంచెం వక్రంగా వుంటుంది. ఇతడు నాలుగు చేతులు కలిగి వుంటాడు. ఆ చేతుల్లో ధనస్సు, బాణములుంటాయి. మరో రెండు చేతులతో నమస్కార భంగిమతో వుంటాడు. ఇతని వాహనం బంగారు కాకి.
 
ఇతని తల్లిదండ్రులు సూర్యుడు, ఛాయలు. ఇతని భార్య జ్యేష్ఠాదేవి. ఈ గ్రహ దోషమున్నవారు ఇంద్ర నీలాన్ని ధరించాలి. ఆలయానికి వెళ్లి స్వామిని పూజించాలి. నల్లనువ్వులను, నల్లగుడ్డను దానమివ్వాలి. నువ్వులను నల్లటి గుడ్డలో చుట్టి, నువ్వులనూనెలో ముంచి ఆ గుడ్డనే వత్తిగా చేసి శనీశ్వర స్వామి సన్నిధిలో వెలిగించాలి. నువ్వుల అన్నాన్ని నివేదించాలి. ఇలా చేసినట్లయితే గ్రహదోషం తొలగి శాంతిసౌభాగ్యాలు, సద్గతీ కలుగుతాయి. శని అంటే.. శక్తి అని, శనీశ్వరా అంటే శివశక్తి అని అర్థం. వీరి దేవాలయాల్లో తిరునల్లార్ దేవాలయం అత్యంత ప్రసిద్ధమైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు