భృగు మహర్షి కుమార్తె భార్గవిగా జన్మస్తుంది శ్రీలక్ష్మీదేవి. ఆమె కోసం వైకుంఠం నుంచి భూలోకానికి శ్రీనివాసుడిగా భూలోకానికి వస్తాడు మహావిష్ణువు. ఐతే లక్ష్మీ అంశ అయిన పద్మావతి దేవి కూడా శ్రీనివాసుడిని మోహిస్తుంది. ఆమె ఆకాశరాజు కుమార్తె. ఆకాశరాజు ఆస్థానంలో వుంటూ భార్గవిని ప్రసన్నం చేసుకుని ఆమెను పెండ్లి చేసుకోవాలనుకుంటాడు శ్రీనివాసుడు. ఐతే ఆ పరమేశ్వరుడు లీలలు చమత్కారంగా వుంటాయి కదా. పద్మావతి నుంచి శ్రీనివాసుడు ఎంతమాత్రం తప్పించుకోలేని స్థితిలో పడిపోతాడు. చివరికి ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతితో శ్రీనివాసుడి వివాహం జరుగుతుంది. ఇది తెలిసిన మహాలక్ష్మి రూపమైన భార్గవి ఆగ్రహంతో అక్కడికి వస్తుంది.
తనను ప్రేమించి తనే లోకంగా వున్న నీవు ఆమెను ఎట్లా పెళ్లాడావంటూ నిలదీస్తుంది. అదే ప్రకారంగా శ్రీనివాసుడు తనవాడంటూ పద్మావతి గొడవకు దిగుతుంది. సపత్నుల కలహం ముదిరిపోవడంతో వారికి సర్ది చెప్పలేక శ్రీనివాసుడు శిలగా మారిపోతాడు. ఆనాటి నుండి నేటికీ తిరుమల కొండపై కొలువైన శ్రీనివాసుడు... తిరుమలేశుడు... గోవిందుడు... ఆ వేంకటేశ్వరుడు ఈ భూలోకం లోనే శ్రీ మహావిష్ణువు రూపంలో వున్న కలియుగ దైవం భక్తుల పూజలందుకుంటున్నాడు. ఓ నమో వేంకటేశాయ... ఓం నమో నారాయణాయ.