కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో తిరుమలలో ఉగాది నుంచి శ్రీవారి ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అలిపిరిలో రెండు చోట్ల రెండువేల వాహనాలు, తిరుమలలో రెండు చోట్ల 1,500 వాహనాలు పార్క్ చేసేలా మల్టీలెవల్ పార్కింగ్ సముదాయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఈవో చెప్పారు.
తితిదే కల్యాణ మండపాల లీజు కాలాన్ని 3 నుంచి 5 ఏళ్లకు, ఆ తర్వాత మరో రెండేళ్లు పొడిగించేలా విధివిధానాలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఎనర్జీ తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.