భారీగా పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం, ఎంతో తెలుసా?

శనివారం, 19 డిశెంబరు 2020 (14:43 IST)
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. కరోనా తరువాత గత వారం క్రితం ఒకసారి రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం రాగా మరోసారి హుండీ ఆదాయం అదేస్థాయిలో పెరిగింది. భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతుండడంతో హుండీ ఆదాయం పెరుగుతున్నట్లు టిటిడి భావిస్తోంది. 
 
లాక్ డౌన్ అనంతరం మరోసారి 3 కోట్ల రూపాయలు దాటింది శ్రీవారి హుండీ ఆదాయం. పరకామణి రెక్కింపులో మూడురోజుల క్రితం రికార్డు స్థాయిలో శ్రీవారికి 3 కోట్ల 14 లక్షల రూపాయలు హుండీ ఆదాయం సమర్పించారు భక్తులు. అదే రికార్డ్ అని టిటిడి భావించింది.
 
కానీ నిన్న పరకామణి లెక్కింపులో 3 కోట్ల 24 లక్షల రూపాయలు చేరుకుంది హుండీ ఆదాయం. భారీగా హుండీ ఆదాయం రావడంతో టిటిడి సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు. కరోనా కన్నా ముందుగా ఏవిధంగా అయితే తిరుమలలో హుండీ ఆదాయం వస్తూ ఉండేదో అదే విధంగా ప్రస్తుతం కూడా వస్తోందని టిటిడి అధికారులు భావిస్తున్నారు. క్రమేపీ మరింతగా హుండీ ఆదాయం పెరిగే అవకాశం ఉందని టిటిడి అధికారులు భావిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు