తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించేది లేదు..

సెల్వి

మంగళవారం, 19 మార్చి 2024 (17:47 IST)
ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరుమలలో దర్శనం లేదా వసతి కోసం ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించకూడదని నిర్ణయించింది. అయితే కోడ్ ముగిసే వరకు నిబంధనల ప్రకారం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే శ్రీవారి దర్శనం, వసతిని పరిగణనలోకి తీసుకుంటారు. 
 
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో శనివారం నుంచి తిరుమలలో బస, శ్రీవారి దర్శనానికి సంబంధించిన సిఫార్సు లేఖలను టీటీడీ ట్రస్టు బోర్డు రద్దు చేసినట్లు టీటీడీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయాన్ని భక్తులు, వీఐపీలు గమనించి నిర్వాహకులకు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు