"ఆమె"ని పెళ్ళి చేసుకున్న"ఆయనగారు" : శ్రీకాంత్‌

మంగళవారం, 7 ఆగస్టు 2007 (09:03 IST)
ప్రేమంటే ఆకర్షణకాదని, రెండు హృదయాల స్పందన అని అలాంటి ప్రేమ శాశ్వతమని నిరూపించిన ప్రేమజంట శ్రీకాంత్‌, ఊహ. తమ ప్రేమ గురించి శ్రీకాంత్‌ ఏం చెబుతున్నారో చదవండి.

ఊహని తొలిసారిగా "ఆమె" చిత్రం ప్రారంభోత్సవంలో రామానాయుడు స్టూడియోలో చూశాను. కొన్ని రోజులు షూటింగ్‌లో పాల్గొన్న తరువాత ఆమె ఎలాంటి వ్యక్తిత్వం వున్న మనిషో, మనసు ఎలాంటిదో అర్ధమయింది. దానితో నాకు తెలియకుండానే నా మనసు "ఆమె" పట్ల మొగ్గు చూపటం ప్రారంభించింది.

తనకు కూడా నా పట్ల అదే రకమైన భావన కలగటంతో మా ఇద్దరి మధ్య జనించిన ప్రేమ, పెళ్ళి దాకా వచ్చింది.
ఆమెకు ప్రేమ లేఖలు అయితే రాయలేదు కానీ, ప్రతిరోజు ఫోన్‌ మాత్రం చేస్తూ వుండేవాడిని. తాను నాకెన్నో జాగ్రత్తలు చెప్పేది. ఇవన్నీ ఆమె పట్ల నాలో మరింత ఆరాధనాభావం పెంచేలా చేశాయి.

ఊహ వ్యక్తిత్వం, మంచితనం మా ఇంటిలో అందరికీ నచ్చింది. అందుకే మా పెళ్ళికి మనస్ఫూర్తిగా అంగీకరించారందరూ ... మాది ఆకర్షణతో కూడిన ప్రేమ కాదు. ఆప్యాయతతో నిండిన ప్రేమ. మా ఇద్దరి మధ్య చక్కని అవగాహన వుంది. తను నా మనసుని నొప్పించే పని ఏదీ చెయ్యలేదు. నేను కూడా అంతే. ఆమె అభీష్టానికి విరుద్ధంగా ఇంతవరకు ప్రవర్తించలేదు అని చెప్పారు శ్రీకాంత్‌.

వెబ్దునియా పై చదవండి