ప్రేమంటే ఏమిటని కుర్రకారును ప్రశ్నిస్తే కళ్లలోకి కళ్లుపెట్టి చూచుకోవడం, ఒకే ఐస్‌క్రీంని ఇద్దరు పంచుకోవడం, పార్కులకు, బీచ్‌లకు కలిసి తిరగడం అనే సమాధానాలు రావచ్చు. అయితే ఇవన్నీ ప్రేమలో ఒకభాగం మాత్రమే. ఎందుకంటే కళ్లలోకి కళ్లుపెట్టి చూసుకుంటూ గడిపేస్తామంటూ ఏ ప్రేమికులైనా అంటే వారి ప్రేమ జీవితాంతం నిలుస్తుందన్న గ్యారంటీ తగ్గిపోయినట్టే.
ఒకరిపై ఒకరికి నమ్మకం, జీవితాంతం కలిసి ఉండాలనే తపన, ఎవరికోసం కూడా ప్రేమను త్యాగం చేయకూడదనుకునేంతటి ఇష్టం లాంటివి ఉన్నప్పుడే షికార్లు చేసిన ప్రేమ జీవితాంతం కలిసి పయనించేందుకు తోడ్పడుతుంది. కళ్లు కలుసుకుని మనసులు ఊహలు చెప్పుకుని మొదలైన ప్రేమ భావాలు పంచుకుని ఒకరికోసం ఒకరు తమను మార్చుకోవడానికి కూడా సిద్ధపడినపుడే పూర్తి పరిపూర్ణత సాధిస్తుంది.