'పచ్చ పార్టీ' అప్పుడు జగన్ ను ఇప్పుడు బ్రదర్ అనిల్ ను హీరో చేస్తోందట
FILE
పచ్చపార్టీ అప్పుడు జగన్ మోహన్ రెడ్డిని, ఇప్పుడు బ్రదర్ అనిల్ ను హీరోలు చేస్తోందంటూ చర్చ జరుగుతోంది. దీనిపై ఒకరు... "ఇప్పుడు బ్రదర్ అనిల్ ని సూపర్ స్టార్ ని చేసే పని మొదలేశారు ఈ పచ్చ పార్టీ వాళ్ళు. సొంత వాళ్ళనే పట్టించుకోని ఈరోజుల్లో ఎవరు మాత్రం చేస్తారండి తన శత్రువుకి ప్రచారం.
కాని ఈ పచ్చ పార్టీ చేస్తుంది ఆపని. ఏది ఏమైనా YSR ఫామిలీ ఈ పచ్చ పార్టీకి జీవితాంతం రుణపడి వుండాలి ఖచ్చితంగా. ఎందుకంటే YSR ఫామిలీ మెంబర్స్ కి పైసా ఖర్చు లేకుండా, వాళ్లకి వాళ్ళు ఎటువంటి ప్రచారం లేకుండా YSR ఫామిలీ మెంబర్స్‌ని AP రాజకీయాల్లో సూపర్ స్టార్స్ ని తయారు చేసే పనిని చాలా విజయవంతంగా కొనసాగిస్తున్నారు.
ఈ పచ్చ పార్టీ ఇప్పుడు బ్రదర్ అనిల్ ని సూపర్ స్టార్ ని చేసే పని మొదలేసింది. ఎంతో కష్టపడితే గాని సెలెబ్రిటీ హోదా గాని , స్టార్ లు కాలేని ఈ రోజుల్లో ఎవరు చేస్తారండి ఫ్రీగా ప్రచారం ఒక మనిషికి ...మరి ఆ బాధ్యత ఈ పచ్చ పార్టీ నెత్తినేసుకుంది మరి'