Divya Deshmukh: ప్రపంచ చెస్ ఫైనల్.. రికార్డ్ సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్

సెల్వి

గురువారం, 24 జులై 2025 (12:11 IST)
Divya Deshmukh
భారత యువ చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ ఫిడే మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించింది. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఫైనల్‌కు చేరిన మొదటి భారతీయ మహిళగా దివ్య దేశ్‌ముఖ్ రికార్డ్ సృష్టించింది. 
 
ప్రపంచ నంబర్ 18 అయిన దివ్య మొదటి సెమీఫైనల్‌లో నల్లపావులతో ఆడి డ్రా చేసుకుంది. రెండో గేమ్‌లో ఆమెకు తెల్లపావులతో ఆడటం ప్రయోజనకరంగా మారింది. 
 
ప్ర‌త్య‌ర్థిని 101 ఎత్తుల్లో ఓడించి ఫైన‌ల్‌కి అర్హ‌త సాధించింది. ఈ గెలుపు భారత మహిళా చెస్‌కు గొప్ప విజయమ‌ని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా.. గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి రెండో సెమీఫైనల్ చైనాకు చెందిన లీ టింగీతో డ్రా అయింది. ఇప్పుడు ఆమె టై-బ్రేక్ ఆడనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు