బ్యాడ్మింటన్‌లో భారత దశాబ్దాల కాల కల నెరవేరింది. భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్ - చిరాక్ శెట్టి జోడీలు చరిత్ర సృష్టించారు. దుబాయ్ వేదికగా జరిగిన బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో మలేషియాకు చెందిన జోడీని చిత్తు చేశారు. ఫలితంగా 58 యేళ్ల తర్వాత భారత్‌కు స్వర్ణ పతంకం లభించింది. దుబాయ్ అల్ నసర్ క్లబ్‌లోని షేక్ రషీద్ బిన్ హమ్దాన్ ఇండోర్ హాల్‌లో ఆదివారం జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్లు అయిన మలేషియాకు చెందిన యెన్ సిన్ -ట్రియో జోడీతో ప్రపంచ ఆరో ర్యాంకర్లు అయిన సాత్విక్ - చిరాగ్ జోడీ తలపడి ప్రత్యర్థి జంటను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో ఓడిన భారత జట్టు ఆ తర్వాత పుంజుకుని 16-21, 21-17, 21-19 సెట్లతో విజయం సాధించి దేశానికి బంగారు పతకం సాధించి పెట్టారు. ఇది భారత్‌కు చారిత్రక విజయం. దాదాపు 58 యేళ్ల తర్వాత ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ పోటీల్లో భారత్‌కు స్వర్ణ పతకం వచ్చింది. 1965లో భారత ఆటగాడు దినేశ్ ఖన్నా పురుషుల సింగిల్స్‌లో బంగారు పతకం గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఇన్నాళ్లకు ఇపుడు బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో ఈ స్వర్ణపతకం లభించింది.