పేదల కడుపు నింపుతున్న పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్

సోమవారం, 24 మే 2021 (14:05 IST)
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ బారినపడిన అనేక మంది మృత్యువాతపడుతున్నారు. వేలాది మంది చనిపోతున్నారు. ఈ క్రమంలో క‌రోనా క‌ట్ట‌డి కోసం లాక్‌డౌన్ విధించ‌డంతో నిర్మాణ‌, వ్యాపార రంగ కార్య‌క‌లాపాలు నిలిచిపోయాయి. దాంతో రెక్కాడితేగాని డొక్కాడ‌ని పేద‌ల‌కు ఉపాధి క‌రువైంది. తిన‌డానికి తిండిలేక నానా అవ‌స్థ‌లు ప‌డాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. మరికొందరికి ఒక్కపూట కూడా కడుపు నిండా తిండి దొరగడం లేదు. ఇలాంటివారి పరిస్థితి మరింత దీనంగావుంది. 
 
ఈ పరిస్థితుల్లో ప‌వ‌ర్‌లిఫ్టింగ్‌లో అంత‌ర్జాతీయ ఛాంపియ‌న్, జాతీయస్థాయి షూట‌ర్‌, ఢిల్లీలోని చాందినీ చౌక్ టెంపుల్‌లో మ‌హంత్ అయిన గౌర‌వ్ శ‌ర్మ పేద‌ల కోసం త‌న‌వంతు సాయం చేస్తున్నాడు. అవ‌స‌ర‌మైన వారికి నిత్యం ఆహారం పొట్లాలు, తాగునీళ్లు అంద‌జేస్తున్నాడు. గ‌త లాక్‌డౌన్‌లో కూడా తాను ఇలాగే చేశాన‌ని, ఇప్పుడు గ‌త 15 రోజులుగా ఆహారం పంచుతున్నాన‌ని గౌర‌వ్ శ‌ర్మ చెప్పాడు. లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్న‌న్ని రోజులు త‌న సేవ కొన‌సాగుతుంద‌న్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు