ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బాధిత దేశాల్లో యూరప్ ఒకటి. చైనా, ఇటలీ, స్పెయిన్ తర్వాత అధిక ప్రభావం కలిగిన దేశం. ఈ కరోనా వైరస్ యూరప్‌ను అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఇటలీలో ఇప్పటికే 2158 మంది మృత్యువాతపడ్డారు. స్పెయిన్‌లో 335 మంది చనిపోయారు.
తాజాగా యూరప్‌లో స్పానిష్ ఫుట్‌బాల్ కోచ్ ఫ్రాన్సికో గార్సియా ప్రాణాలు కోల్పోయారు. ఈయన కరోనా వైరస్ కారణంగానే చనిపోయినట్టు తెలుస్తోంది. ఈయన వయసు కేవలం 21 యేళ్లు కావడం ఇపుడు ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రపంచంలోనే అతి తక్కువ వయసులో లుకేమియాతో పోరాడుతూ మృతిచెందిన వ్యక్తిగా ఫ్రాన్సికో నిలిచాడు.