పాపకు అలెక్సిన్ ఒలింపియా ఒహానియర్ జూనియర్ అనే పేరు పెట్టినట్లు ప్రకటించింది. ఆస్పత్రిలో ఆరు రోజుల పాటు ఉన్నానని, గర్భం దాల్చినప్పటి నుంచి పాపకు జన్మనిచ్చేంత వరకు జరిగిన పరిణామాలపై సెరెనా డాక్యుమెంటరీని కూడా విడుదల చేసింది.
తన శ్వేత వర్ణం వల్లే సెరెనా తనపై ద్వేషభావం పెంచుకుందని చెప్పుకొచ్చింది. గత 13 ఏళ్లుగా ఈ శత్రుత్వం కొనసాగుతోందని షరపోవా చెప్పింది. సెరెనాను ఓ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో తాను ఓడించడం, ఆ ఓటమి బాధతో ఆ నల్లకలువ లాకర్ రూమ్‌లో వెక్కివెక్కి ఏడ్వడాన్ని తన ఆటోబయోగ్రఫీ షరపోవా వివరించింది.
ఇంకా చెప్పాలంటే తన భారీ, బలమైన శరీరంతోనే ఆమె తనను భయపెట్టేసేదని షరపోవా ఆ పుస్తకంలో రాసింది. అయితే షరపోవా మాటలపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విమర్శలు వినిపించాయి. 23 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన సెరెనాతో 5 గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన షరపోవాకు అసలు పోలికే లేదని నెటిజన్లు ఫైర్ అయ్యారు.