తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల్లో ఆందోళనకర ధోరణి కనిపిస్తోంది. గత నెల రోజులుగా, వర్షాకాలంలో డెంగ్యూ, చికున్‌గున్యా, వైరల్ ఫీవర్ కేసుల పెరుగుదల కారణంగా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 15 నుండి 25 శాతం వరకు తగ్గినట్లు నివేదికలో వెల్లడి అయ్యింది.
నగరంలోని పాఠశాలల్లో వైరల్ ఇన్‌ఫెక్షన్‌ల కారణంగా విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావట్లేదు. గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా పారిశుధ్యం, తక్కువ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ఉన్న ప్రదేశాలలో ఇది ఎక్కువగా ఉంది. వైరల్ ఇన్‌ఫెక్షన్లు, జ్వరాలు పెరుగుతున్నందున, తల్లిదండ్రులు తమ పిల్లలకు అంటువ్యాధి సోకుతుందనే భయంతో పాఠశాలలకు పంపడానికి ఇష్టపడట్లేదు.
సాధారణంగా పాఠశాలల్లో 85 శాతం హాజరు నమోదవుతుంది. అయితే, వైరల్ ఇన్ఫెక్షన్ కేసుల దృష్ట్యా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో హాజరు శాతం 20 శాతం పడిపోయింది.