యాసంగి సీజన్‌ రైతు బంధు విడుదలకు సీఎం రేవంత్ సమ్మతం

మంగళవారం, 12 డిశెంబరు 2023 (11:31 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పారు. ఎన్నికల ముందు యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు నిధుల విడుదలకు గత ప్రభుత్వం ప్రయత్నించినా అనివార్య కారణాల వల్ల నిధుల విడుదల సాధ్యంకాలేదు. ఇపుడు ఈ నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం ట్రెజరీలో ఉన్న నిధులను పంట పెట్టుబడి సాయం కింద రిలీజ్ చేసేలా ఆయన సూచించారు. 
 
రైతులకు రైతు భరోసా పథకం కింద ఎకరారు యేటా రూ.15 వేలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. గత ప్రభుత్వంలో బీడు భూములు, భూస్వాములకు కూడా రైతు బంధు పథకం కింద వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారని, వీటన్నింటిపై సమీక్షించిన తర్వాతే నీటిని విడుదల చేస్తామని పలువురు కాంగ్రెస్ మంత్రులు, నేతలు ప్రకటించారు. 
 
అయితే, ఇప్పటికిపుడు రైతు భరోసా అమలుకు రూ.11 వేల కోట్లు అవసరమవుతాయని వార్తలు వచ్చాయి. ఆ మొత్తం ఖజానాలో లేకపోవడంతో రైతు భరోసా నిధులు ఇప్పటిలే విడుదల కావంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో రైతులు ఆందోళన చెందారు. ఈ పరిస్థితుల్లో రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు