తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి నిర్వహించిన సర్జరీ విజయవంతం అయినట్లు యశోధ వైద్యులు వెల్లడించారు. ఈ శస్త్రచికిత్సకు ఆయన శరీరం బాగానే సహకరించిందని వారు తెలిపారు. సర్జరీ విజయవంతం కావడంతో కేసీఆర్‌ను ఆపరేషన్ థియేటర్ నుంచి సాధారణ రూమ్‌కు మార్చారు. కేసీఆర్ పూర్తిగా కోలుకోవడానికి మరో 6 నుంచి 8 వారాలు దాకా పడుతుందని వైద్యులు వెల్లడించారు.
సీటీ స్కాన్‌తో పాటు పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన ఎడమ తుంటికి ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించామని తెలిపారు. ఈ ఎడమ తుంటిని రీప్లేస్ చేయాల్సి ఉందని వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో కోలుకోవడానికి కనీసం 6 నుంచి 8 వారాల సమయం (రెండు నెలలు) పడుతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఆర్థోపెడిక్, అనస్తీషియా, జనరల్ మెడిసిన్, పెయిన్ మెడిసిన్ విభాగాలకు చెందిన మల్టీ డిసిప్లనరీ డీమ్ ఆయనను పర్యవేక్షిస్తుందని తెలిపారు.