చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

ఠాగూర్

బుధవారం, 23 ఏప్రియల్ 2025 (17:44 IST)
గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ సృష్టిస్తున్న లేడీ అఘోరీ నాగసాధుపై హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నగర మోకిలా పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో నాగసాధుకు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉన్నట్టు ఆమె తరపు న్యాయవాది అభిప్రాయపడుతున్నారు. పైగా, ఇది చీటింగ్ కేసు కావడంతో పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారో, బెయిల్ ఎపుడు వస్తుందో తాను చెప్పలేనని ఆయన వ్యాఖ్యానించారు. 
 
కాగా, మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అఘోరీని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఆ తర్వాత ఆమెను చేవెళ్ల కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ప్రాథమిక ఆధారాలు, వాదనలు పరిగణనలోకి తీసుకున్న జడ్జి... అఘోరీకి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో అఘోరీని సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు. కాగా, ప్రత్యేక పూజల పేరుతో ఓ మహిళ నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి మోసగించారని మహిళ ఫిర్యాదు ఇవ్వడంతో లేడీ అఘోరీపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
మరోవైపు తన అరెస్టుపై నాగసాధు స్పందిస్తూ, ఈ కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. అలాగే, చీటింగ్ కేసులో తనను జైలుకు పంపినా తన భార్య వర్షిణి మాత్రం తనతోనే ఉంటుందని చెప్పారు. తాను జైలుకు వెళ్లినా తన భార్య నాతోనే ఉంటుందని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్నారు. ప్రస్తుతానికి తానేమీ మాట్లాడనని, తాను జైలుకు వెళ్లినా తన భార్య వర్షిణి మాత్రం తనతోపాటు ఉంటుందని అఘోరీ చెప్పుకొచ్చారు. 
 
కాగా, పదేళ్ల జైలుశిక్ష పడే ఛాన్స్... 
 
చీటింగ్ కేసులో అరెస్టయిన మహిళా అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదని ఆమె తరపు న్యాయవాది అంటున్నారు. దీనిపై లాయర్ స్పందిస్తూ, బెయిల్ ఎపుడు వస్తుందో చెప్పలేమని, చీటింగ్ కేసు కాబట్టి ఏ విధంగా చర్యలు తీసుకుంటారో కూడా చెప్పలేమన్నారు. ఈ కేసులో అఘోరీకి పదేళ్లలోపు శిక్ష పడే అవకాశం అవకాశం ఉందన్నారు. తనకు కేసు పేపర్లు మాత్రమే ఇస్తారని, ఎలాంటి విషయాలు చెప్పలేమన్నారు. అఘోరీకి న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తుందని ఆమె తరపు న్యాయవాది వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు