రూ.18లక్షలు స్వాహా.. హైదరాబాద్‌లో టెక్కీని నిమిషాల్లో కాపాడారు..

సెల్వి

శనివారం, 29 జూన్ 2024 (11:18 IST)
హైదరాబాద్‌లో టెక్కీని సైబర్ క్రైమ్ నుంచి పోలీసులు నిమిషాల్లో స్పందించారు. అంబర్​ పేట్​ ప్రాంతంలో నివాసం ఉండే ఓ ప్రముఖ కంపెనీలో పని చేస్తున్న సాఫ్ట్​వేర్​ ఉద్యోగికి ఈనెల 27న ఫెడెక్స్​ కంపెనీ నుంచి ఓ కాల్​ వచ్చింది. 
 
కాల్​లో తన ఆధార్​ కార్డు ఉపయోగించి ముంబయి నుంచి ఇరాన్​కు డ్రగ్స్​ కొరియర్​ అవుతున్నట్లు తెలిపారు. అనంతరం ముంబయి క్రైమ్ అధికారి అంటూ బాధితుడుకు స్కైప్​ వీడియో కాల్​ చేశారు. 
 
అక్రమంగా డ్రగ్స్​ సరఫరా అవుతున్నాయని అతనిపై కేసు నమోదు అయిందని నకిలీ ఎఫ్​ఐఆర్​ను పంపించారు. అలాగే అతని అకౌంట్​లో ఉన్న డబ్బును పంపిస్తే ఆర్​బీఐ నిబంధనల ప్రకారం వేరిఫై చేసి తిరిగి పంపిస్తామని సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని నమ్మించారు. 
 
వారి మాటలు నమ్మి బ్యాంకు నుంచి రూ.18 లక్షలు అప్పు తీసుకున్నాడు. సైబర్​ నేరగాళ్ల అకౌంట్​కు ట్రాన్​ఫర్​ చేశాడు. ఆ డబ్బును సైబర్​ నేరగాళ్ల ఖాతాకు పంపిన తర్వాత వారు కాల్​ను కట్​ చేశారు.
 
వెంటనే ఎన్నిసార్లు ఫోన్​ చేసిన స్విచ్ఛాప్​ రావడంతో బాధితుడు తాను సైబర్​ దాడిలో మోసపోయాయని తెలుసుకొని వెంటనే సైబర్​ క్రైమ్​ పోలీసులను ఆశ్రయించాడు. అదే రోజు సాయంత్రం 6.58 గంటలకు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్​ శ్రీకాంత్​ నాయక్​ ఎన్​సీఆర్​పీ పోర్టల్​లో ఆన్​లైన్​లో ఫిర్యాదు నమోదు చేశారు.
 
వెంటనే ఐసీఐసీఐ బ్యాంకు సిబ్బందితో మాట్లాడారు. బాధితుడి అకౌంట్​ నుంచి ట్రాన్స్​ఫర్​ అయిన రూ.18 లక్షల నగదును రాత్రి 07.09 గంటలకు బ్లాక్​ చేశారు. దీంతో బాధితుడు ఊపిరి పీల్చుకుని తన నగదు ఖాతాలో జమ అవుతాయన్న ఆనందంలో మునిగిపోయాడు. ఈ ఆపరేషన్​ మొత్తం 11 నిమిషాల వ్యవధిలోనే సక్సెస్​ అయింది.  
 
సైబర్ ఆర్థిక మోసాలను నివేదించడానికి: 
* సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ - 1930కి డయల్ చేయండి
* స్థానిక పోలీస్ స్టేషన్‌ని సందర్శించండి
* నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ – cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు