తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. శాసనమండలిలో రాష్ట్ర ఐటీ శాఖామంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. రేపు బడ్జెట్‌ను ప్రవేశపెడుతారని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమవుతుందని తెలిపారు. కాగా, శనివారం ఉందయం 9 గంటలకు తెలంగాణ మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపింది.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదనలు ఉండవు. కేవలం ఖర్చులు మాత్రమే ఉంటాయి. ప్రభుత్వం కార్యకలాపాలు, శాఖల నిర్వహణ, ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ పంపిణీ సాఫీగా సాగేందుకు వీలుగా వచ్చే రెండు నెలల కోసం ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.