బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో ఫారం, బ్రాయిలర్ కాకుండా.. నాటుకోడి వైపు జనం మళ్లుతున్నారు. గోదావరి జిల్లాల్లో ఇప్పుడు నాటుకోళ్లు కూడా బర్డ్ ఫ్లూ వల్ల చనిపోతున్నాయి. దాంతో.. కోళ్ల వ్యాపారులు లబోదిబోమంటున్నారు. నిండా మునిగిపోయామని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గోదావరి జిల్లాల్లో వారు చికెన్ కొనుక్కుందామన్నా దొరకని పరిస్థితి ఉంది.
తాము రూ.100 కోట్ల దాకా నష్టపోయామని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని అంటున్నారు. రోజూ వేలల్లో కోళ్లు చనిపోతున్నాయనీ.. ఇన్ని రోజులూ.. నాటుకోళ్లకు ఈ వ్యాధి రాలేదు కదా అనుకుంటే ఇప్పుడు అవి కూడా చనిపోతున్నాయని కోళ్ల వ్యాపారులు వాపోతున్నారు.