హైదరాబాద్ నగరాన్ని 40 యేళ్లుగా రజాకార్లు ఏలుతున్నారు : అమిత్ షా

ఠాగూర్

గురువారం, 2 మే 2024 (08:43 IST)
హైదరాబాద్ నగరాన్ని గత నాలుగు దేశాబ్దాలుగా రజాకార్లు ఏలుతున్నారంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఇలాంటి పాలనకు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం హైదరాబాద్ నగరంలో పర్యటించారు. లాల్ దర్వాజ అమ్మవారి గుడి నుంచి సుధా టాకీస్ వరకు ఆయన ర్యాలీ నిర్వహించారు. 400 సీట్లతో నరేంద్ర మోడీని మరోమారు ప్రధానిగా చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. 
 
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు రావడం ఖాయమన్నారు. అందులో హైదరాబాద్ కూడా ఉండాలన్నారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజవర్గంలో పార్టీ అభ్యర్థి మాధవీలతకు మద్దతు హైదరాబాద్ ఓటర్లు నిలబడాలని పిలుపునిచ్చారు. 
 
హైదరాబాద్ నగరాన్ని గత 40 యేళ్లుగా రజాకార్లు ఏలుతున్నారంటూ విమర్శించారు. రజాకార్ల నుంచి హైదరాబాద్ నగరానికి విముక్తి కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత మాట్లాడుతూ, ఈసారి మనం హైదరాబాద్‌ను గెలుచుకోవాలన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి వల్ల, ఉజ్జయిని మహంకాళీ శక్తితో ఈ సారి హైదరాబాద్ నగరంలో కమలం పుప్వు వికసిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు : ఈ నెల 7, 8 తేదీల్లో ప్రధాని మోడీ పర్యటన!!
 
లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం ముమ్మరంగా ప్రచారం సాగుతుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేబీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. దీంతో కూటమి అభ్యర్థుల విజయం కోసం బీజేపీ అగ్ర నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకసారి రాష్ట్రానికి వచ్చారు. తాడేపల్లిగూడెం వేదికగా జరిగిన ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ నేపథ్యంలో మరోమారు రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు బీజేపీ బుధవారం ప్రధాని ఎన్నికల ప్రచార పూర్తి షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. 
 
7వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు రాజమండ్రికి చేరుకుని ఎన్డీయే ఎంపీ అభ్యర్థి, బీజేపీ, రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తరపున  వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగింస్తారు. అలాగే, సాయంత్రం 5.45 గంటలకు అనకాపల్లి పరధిలోని రాజుపాలెం సభలో ప్రధాని పాల్గొంటారు. 8వ తేదీన సాయంత్రం 4 గంటలకు పీలేరు సభకు హాజరవుతారు. రాత్రి 7 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానం నుంచి బెంజి సర్కిల్ వరకు ఆయన రోడ్‌షో నిర్వహిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు