కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్పిన మధుయాష్కీ... ఎందుకో తెలుసా?

గురువారం, 18 అక్టోబరు 2018 (20:45 IST)
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను చ‌దివి తెలంగాణ ప్రజానీకానికి వినిపించినందుకు కేసిఆర్‌కు ధన్యావాదాలు తెలియజేశారు, కాంగ్రెస్ పార్లమెంట్ మాజీ సభ్యుడు మధుయాష్కీ గౌడ్. కాంగ్రెస్ వాళ్లు చెప్పిన హ‌మీలు నేర‌వేరుతాయ‌ని కేసీఆర్ ఒప్పుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కేసిఆర్ మూడో పెగ్గు వేసుకోకుండా మూడో క‌న్ను తెరిచి నిజం చెప్పినందుకు ధన్యావాదాలు అన్నారు.
 
గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ల‌క్ష రూపాయ‌ల రుణమాఫీ చేస్తాన‌ని చెప్పిన కేసిఆర్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రుణమాఫీ ఏ మేరకు చేశారో రైతులంద‌రికీ తెలుసు. మరలా ఇప్పుడు 5 లక్షల రూపాయ‌ల రుణమాఫి చేస్తామ‌ని చెబితే రైతులు న‌మ్మే ప‌రిస్థితిల్లో లేరన్నారు మధుయాష్కీ. 
 
టీఆర్ఎస్ ప్ర‌క‌టించిన మ్యానిఫెస్టోలో కొత్త‌ద‌నం ఏమీ లేదన్నారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ తెలంగాణ ప్ర‌జ‌ల త‌రుపున ఏర్ప‌డిందని, క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని బొంద పెట్ట‌డానికి తెలంగాణ ప్ర‌జాఫ్రంట్ ఏర్పడిందన్నారు. రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లోనే భాగంగానే పొత్తుల చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. పొత్తుల‌కు ఎటువంటి ఇబ్బందీ లేదని టీఆర్ఎస్ పార్టీ ముందుగానే అభ్య‌ర్థులను ప్ర‌క‌టించి మూతి ప‌గలగొట్టుకుందని, మేము వ్యూహ్య‌త్మ‌కంగానే స‌మ‌యం తీసుకుంటున్నాం అన్నారు మధు యాష్కీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు