తెలంగాణలో విద్యుత్ చార్జీల వాత ఖాయం, కసరత్తు చేస్తున్న అధికారులు
బుధవారం, 1 డిశెంబరు 2021 (11:47 IST)
తెలంగాణలో విద్యుత్ చార్జీలను భారీగా పెంచే యోచనలో టీఎస్ ఈఆర్సి కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఏమాత్రం సరిపోవడంలేదనీ, ఏకంగా రూ. 21,550 కోట్లు లోటుతో వున్నట్లు అధికారులు చెపుతున్నారు.
ఈ లోటును భర్తీ చేయాలన్నా, వచ్చే వేసవి కరెంట్ వినియోగానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయాలన్నా వినియోగదారులపై చార్జీల భారం మోపక తప్పదని యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
చార్జీలు పెంచే ముందు ప్రజాభిప్రాయ సేకరణ, వారి అభ్యంతరాలు దృష్టిలో పెట్టుకుని ఎంత పెంచాలన్న అంశాన్ని నిర్ణయిస్తామని చెపుతున్నారు. మొత్తమ్మీద చూస్తే తెలంగాణలో ఈసారి విద్యుత్ చార్జీల మోత మోగేట్లు వుంది.