దుబ్బాక ఉప ఎన్నిక, చివరి క్షణంలో కరోనా బాధితులకు ఓటు వేసే అవకాశం

మంగళవారం, 3 నవంబరు 2020 (18:31 IST)
కోవిడ్ నిబంధనల నడుమ దుబ్బాక ఉప ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పంచాలనే ఉద్దేశంతో అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా కరోనా బాధితులకు చివరి క్షణంలో ఓటు హక్కు కల్పించారు. సాధారణంగా ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుండగా ఆ తర్వాత ఆరు గంటల వరకు కరోనా బాధితులకు ఓటేసే అవకాశం కల్పించడం జరిగింది.
 
చివరి గంట పోలింగ్ కరోనా బాధితుల కోసం కేటాయించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా దుబ్బాకలో పోలింగ్ ప్రశాంతంగా జరిగందని, మధ్యాహ్నం 1గంట వరకు 55.52 శాతం ఓట్లు పోలవగా 3 గంటల సమయానికి 71.10 శాతం పోలింగ్ జరిగినట్లు సమాచారం. ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చి ఓట్లు వేయడంతో ఓటింగ్ శాతం పెరిగింది. దీంతో పోలింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు