ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారా? 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలి..

మంగళవారం, 6 నవంబరు 2018 (10:24 IST)
ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ముఖ్యమంత్రి, మంత్రుల అధికారిక నివాసాల్లో టీఆర్‌ఎస్‌ సమావేశాలు నిర్వహిస్తోందని, పోలీసులు కక్షపూరితంగా కేవలం ప్రతిపక్ష నాయకుల వాహనాలనే తనిఖీ చేస్తున్నారని, తమ ఫోన్లను రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం ట్యాపింగ్‌ చేస్తోందని ఆరోపిస్తూ మహాకూటమి ఆధ్వర్యంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టీజేఎస్‌ ఉపాధ్యక్షుడు కపిలవాయి దిలీప్‌కుమార్‌ గురువారం సీఈఓ రజత్‌ కుమార్‌కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. దీనిపై తక్షణమే స్పందించిన ఎన్నికల సంఘం చర్యలు ప్రారంభించింది.
 
ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌తోపాటు రాష్ట్ర మంత్రుల అధికారిక నివాసాల్లో అధికార టీఆర్‌ఎస్‌ సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తోందంటూ అందిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై 24 గంటల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషిని ఆదేశించింది. 
 
ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌ కుమార్‌ శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాపింగ్‌ చేస్తున్నారా? ఒకవేళ చేస్తే ఏ కారణంతో చేస్తున్నారో 24 గంటల్లోగా తెలియజేయాలని ఆదేశించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు