కొత్తగా నిర్మిస్తున్న భవనాలపై అక్రమ వసూలు, డబ్బులడిగితే జైలుపాలే: తలసాని శ్రీనివాస్

గురువారం, 24 సెప్టెంబరు 2020 (18:51 IST)
నగరాల్లో కొత్తగా నిర్మిస్తున్న భవనాల వద్దకు కొంతమంది వచ్చి జులూమ్ చేస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తుంటారు. పెద్దపెద్ద నగరాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు.
 
హైదరాబాద్‌లో కొత్తగా నిర్మిస్తున్న భవనాల దగ్గరికి డబ్బుల కోసం నాయకులు కానీ, లీడర్లు కానీ వచ్చి బెదిరింపులకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటామని, అంతేకాకుండా వారిపై కేసు నమోదు చేసి జైల్లో పెడతామని హెచ్చరించారు. గోశామహల్ నియోజకవర్గంలో కొంతమంది నాయకులు భవన నిర్మాణదారుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.
 
గురువారం తలసాని హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, భవన నిర్మాణదారుల వద్దకు ఎవరూ కూడా వెళ్లి అక్రమ వసూళ్లకు పాల్పడకూడదని తెలిపారు. ఇతర పార్టీకి చెందిన వారినే కాకుండా సొంత పార్టీకి చెందిన నాయకులు ఇలాంటి పనులు చేసినా వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా నాయకులు నిర్మాణదారులను బెదిరిస్తే భయపడకుండా పోలీసు స్టేషన్లో పిర్యాదు చేయాలని సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు