బీమా సొమ్ముకు కక్కుర్తిపడిన ఓ కసాయి ముఠా బీమా పాలసీదారులను చంపేస్తూ వస్తోంది. ముందుగానే నామినీదారులతో ఒప్పందం కుదుర్చుకుని ఆ తర్వాత పాలసీదారులు వాహనం తీసుకెళ్ళి హత్య చేసి.. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 17 మంది ముఠా సభ్యులున్న ఈ ముఠా ఇప్పటివరకు ఐదుగురుని చంపేసింది. ఈ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
నల్గొండ జిల్లాలో వెలుగు చూసిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, గిరిజన ప్రాంతాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను సేకరించిన అనంతరం ముఠా సభ్యులు రంగంలోకి దిగుతారు. వారి కుటుంబ సభ్యులను కలిసి బీమా కట్టేలా ఒప్పిస్తారు. ఒకటి రెండు ప్రీమియంలను వారే చెల్లించేస్తారు.
దామచర్ల మండలంలోని ఓ తండాకు చెందిన ఇద్దరు ప్రైవేటు బీమా ఏజెంట్లు ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. గత కొన్నేళ్లుగా హత్యలకు సహకరిస్తున్న 17 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, ఓ ఏజెంట్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఏజెంట్ కోసం గాలిస్తున్నారు.