ఖైరతాబాద్ మహా గణపతికి వరుసగా ప్రతి సంవత్సరం మహాలడ్డూలను నైవేద్యంగా సమర్పించిన సంస్థగా విఖ్యాతి పొందిన సురుచి ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణేశుని కోసం 100 కిలోల మహాలడ్డూను నైవేద్యంగా సమర్పించడానికి సిద్ధం చేసింది.
ఈ మహాలడ్డూను తీసుకొని హైదరాబాద్ బయలుదేరుతున్న సురుచి అధినేత మల్లిబాబు రేపు ఉదయం ఖైరతాబాద్ మహా గణపతికి సమర్పిస్తారని, ఎల్లుండి మహాలడ్డూ ప్రసాదంను పంపిణీ చేస్తారని సురుచి పీఆర్ఓ వర్మ తెలిపారు.
మహాలడ్డూలతో సంచలన సృష్టించిన శ్రీ మల్లిబాబు 30 టన్నుల మహాలడ్డూతో ప్రపంచ రికార్డు స్థాపించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటుచేసుకున్న విషయం విదితమే.