ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నెలకొన్న పరిస్థితులపై మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే, వివిధ ప్రమాదాల్లో అనేక మంది మరణించటం బాధాకరమన్నారు. పిల్లలు, వృద్ధులు ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని కోరారు.
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం కేంద్ర బృందాలను, పారామిలిటరీని పంపించటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు.... అధికారుల సూచనలు పాటించాలన్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
మరోవైపు, తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న అన్ని రకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ప్రొ. శ్రీరాం వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.